
అనగనగా ఒక తోడేలు ఆకలి మీద గబ గబా తింటుంటే ఒక ఎముక గొంతులో గుచ్చుకుంది. నొప్పి తో విలవిలలాడి పయింది. గొంతులో ఏదైనా మనం దాని గురించి తప్ప ఇంకేమి ఆలోచించలేం. అలాగే ఆ తోడేలు కూడా ఆ ఎముక మింగ
లేక కక్క లేక బాగా బాధ పడింది. కొంగ ను వెతుక్కుంటూ వెళ్ళింది.”నా గొంతులో ఒక ఎముక ఇరుక్కుంది. అది తీసి పెడితే
నేను నీకు ఒక బహుమతి ఇస్తాను”.అని ప్రమాణం చేసింది. ఆ మాట విని కొంగ ఆశ పడి తోడేలు నోట్లో ఉన్న ఎముకను
తన పొడవాటి ముక్కు తో ఎముకను బయటికి లాగింది. ఎముక బయటకు రాగానే తోడేలు వెళ్ళి పోవడం మొదలు పెట్టింది.
కొంగ తోడేలు ను పిలిచి “మరి నా బహుమానం సంగతి ఏమి?” అని అడిగింది. “నీ తల నా నోట్లో పెట్టి కొరికేయకుండా
నిన్ను మళ్ళీ బయటకు తీసుకొనిచ్చాను.”అదే నీ బహుమానం. అని తోడేలు తుర్రుమంది.
దుష్టులకు ఎవరికైనా ఉపకారం చేసినా ఉపయోగం ఉండదు.