
ఒక నల్లమల అడవిలో ఒక సింహం మరియు ఒక ఏనుగు నివసిస్తూ ఉండేవి.ఆ రెండింటికీ తాము బలవంతులమని పొగరు ఎక్కువ.ఒక రోజు ఆ అడవికి రాజు ఎవరు?అనే గొడవ మొదలైంది.రాజు నేనంటే……..కాదు ఈ అడవికి నేనే రాజు అని గొడవ మరింత ఎక్కువైంది.
ఆ సింహం మరియు ఏనుగు రెండూ గొడవ పడుతుంటే మిగతా జంతువులన్నీ భయపడ్డాయి.అప్పుడు సింహం మరియు ఏనుగుల మధ్యకు ఒక నక్క వచ్చింది.మీ ఇద్దరికీ ఒక పందెం పెడతాను.ఆ పందెంలో గెలిస్తే ఈ అడవికి వాళ్లే రాజుగా వుంటారు అని చెప్పింది.దానికి సింహం మరియు ఏనుగు సరే అని అన్నాయి.
నక్క ఏనుగు ను పిలిచి “ఈ రోజు చీకటి పడే లోపల నువ్వు ఒక జింక ను పట్టుకొని రావాలి”అని అంది.
నక్క సింహాన్ని దగ్గరకు పిలిచి”ఈ రోజు చీకటి పడే లోపల నువ్వు ఒక చెట్టును పెరుక్కొని రావాలి”అని అంది.
రెండూ సరేనంటూ అడవిలోకి పరిగెత్తాయి.కానీ చీకటి పడే లోపల ఏనుగు జింక ను పట్టుకొని రాలేక పోయింది.సింహం చెట్టు ను పెరుక్కొని రాలేక పోయింది
అప్పుడు నక్క “ఈ అడవిలో ఒక్కొక్క జంతువు ఒక్కొక్క పని చేయగలదు.అంతే కానీ అందరూ అన్ని పనులు చేయలేరు.కాబట్టి ఈ అడవిలో అన్ని జంతువులు సమానమే”అని చెప్పింది.