పట్టు విడువని కోతి

నాలుగో తరగతి చదువుతున్న రాజు చాలా తెలివైన అబ్బాయి. రాజు వాళ్ళ ఇంటి పక్కన పెద్ద వేప చెట్టు ఉంది.ఆ చెట్టు మీద ఒక కోతి ఉంది.ఆ కోతి చాలా అల్లరి చేసేది.ఇంటిలో ఏవైనా వస్తువులు కనబడితే ఎత్తుకు పోయేది.చేతుల్లో ఏవైనా తినుబండారాలు ఉంటే తీసుకొని పోయేది.ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకోకుండా మీద పడి బరికేది.అందుకే ఆ కోతి అంటే అందరికీ భయం.

రాజు ఎలాగైనా ఆ కోతి ని పట్టుకోవాలి అని మనసులో అనుకున్నాడు.ఇంటి ముందర వేప చెట్టు పక్కన ఒక చిన్న గుంత తవ్వినాడు.ఆ గుంతలో సన్నని మూతి ఉన్న కుండ పెట్టి మూతి తప్ప మిగతా భాగమంతా కప్పి ఉంచినాడు.కుండలో కొన్ని బఠాణి గింజలు వేసినాడు.

కోతి బఠాణీ గింజలు చూసి కుండ దగ్గరకి ఉర్రుక్కుంటూ వచ్చింది.కుండ లోకి చేయి పెట్టి బఠాణి గింజలు తీసుకోవాలని అనుకొంది.అనుకోవడమే తడవుగా చేయి పెట్టి బఠాణి గింజలు తీసుకొంది. కానీ చేయి మాత్రం బయటకు రావడం లేదు కారణం కుండ మూతి చిన్నగా ఉండటమే.ఆ కోతేమో బఠాణి గింజలు చేతి లోకి తీసుకొని బయటకు లాగుతూనే ఉంది.

ఇంతలోనే రాజు ఒక గోనే సంచి తీసుకొని వచ్చి ఆ కోతి మీద వేసినాడు.సంచి మూతి నీ ఒక దారంతో కట్టి కోతిని అడవిలో వదిలి పెట్టి ఇంటికి వచ్చినాడు.

Leave a Comment