
ఒక ఊరి పక్కన చిన్న చెరువు ఉంది. అందులో రెండు కప్పలు ఉన్నాయి. ఎండాకాలం రావడంతో ఆ చెరువు ఎండిపోయింది.అప్పుడు చిన్న కప్ప పెద్ద కప్పుతో ఇక్కడికి కొంచెం దూరంలోనే పెద్ద బావి ఉంది. అక్కడికి పోదామా”అన్నది. సరేనని పెద్ద కప్ప దానితోపాటు బయలుదేరింది. పెద్ద బావిని చూసింది. అది చాలా లోతుగా ఉంది. దాంతో పాటే నీళ్లు అడుగున కొంచెం మాత్రమే ఉన్నాయి.”దీని లోకి దూకుదామా”అన్నది చిన్న కప్ప.
అప్పుడు ఆ పెద్ద కప్ప “ఇందు లోకి దూకడం సులభమే కానీ బయటకు రావడం కష్టం.నీళ్లు కూడా ఎక్కువగా లేవు.బావి ఎండిపోయిందనుకో చావడం తప్ప మరో దారి లేదు”అని అన్నది.చిన్న కప్ప దాని మాటను వినకుండా దూకేసింది.
పెద్ద కప్ప అలాగే వెదుక్కుంటూ వెదుక్కుంటూ ఇంకొక పెద్ద చెరువును చేరుకుంది.ఎండా కాలం మరింత ముదిరింది.బావి లోని నీళ్లన్నీ ఆవిరి అయిపోయాయి.చిన్న కప్పకు దిక్కు తోచలేదు.ఎంత ఎగిరినా పైకి రాలేక పోయింది.ఆ రోజు పెద్ద కప్ప మాట వినక పోతిని కదా అని బాధ పడుతూ చనిపోయింది.
**అందుకే పెద్దలు చెప్పిన మాటలు వినాలి.పెద్దల మాట చద్దిమూట అని ఊరకనే అనలేదు కదా!**